పవన్‌ మౌనం వహించడం సరికాదు


– కేసుల మాఫీ కోసమే జగన్‌ మోడీని పల్లెత్తు మాట అనడం లేదు
– ఏపీ మంత్రి నారాయణ
నెల్లూరు, జనవరి5(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కలిసి పోరాటం చేయడమే సరైన మార్గమని నమ్ముతున్నామని మంత్రి నారాయణ అన్నారు. శనివారం నెల్లూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. జనసేనతో పొత్తుపై స్పందించారు. ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ద్వారా రాష్ట్రానికి రూ.75వేల కోట్లు రావాలని చెప్పిన పవన్‌ మౌనం వహించడం సరికాదన్నారు. కలిసి రావాలా? లేదా అన్నది వారి ఇష్టమన్నారు. కేసుల మాఫీ కోసమే జగన్‌ మోడీని పల్లెత్తు మాట అనడం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో సీఎం చంద్రబాబు ఒంటరి పోరాటం చేస్తున్నారన్నారు. ప్రధాని మోడీ తెర వెనుక ఆడుతున్న నాటకానికి 2019లో ప్రజలు ముగింపు పలకడం ఖాయమన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒంటరిగా పోరాటం చేస్తున్నారని అన్నారు.. ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీ ద్వారా రాష్టాన్రికి రూ.75 వేల కోట్లు రావాలని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు మౌనంగా ఉండడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం కలిసి పోరాటం చేయడమే సరైన మార్గమని మేం నమ్ముతున్నామని నారాయణ స్పష్టం చేశారు. విభజనతో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అన్నీ తానై అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని అన్నారు. కేంద్రం సహకారం ఉంటుందని, ప్రత్యేక ¬దా ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పడంతోనే కేంద్ర కేబినెట్లోచేరామని, కానీ మోదీని ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశారని అన్నారు. దీంతో ప్రతిఘటించి కేంద్రంపై పోరాటానికి దిగితే ఐటీ దాడులతో టీడీపీని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి చర్యలతో టీడీపీ భయపడదన్నారు. తెలుగువారి సత్తాను మరోసారి చాటాల్సిన సమయం వచ్చిందని, ఆమేరకు ఏపీ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీని, దానికి సహకరించే వైకాపాను ఏపీని నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు.