పశువులకు టీకాలు వేయించాలి
బజార్‌హత్నూర్: మండలంలోని డిగ్నూర్, రాంపూర్, గంగాపూర్ గ్రామాల్లో పశువైద్య అధికారి డాక్టర్ శ్రీకాంత్ అధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల రేతులు 220 పశువులకు టీకాలు వేయించారు. ఈ సందర్బంగా పశువులకు సోకే వ్యాదులు, నివారణ చర్యలపై పశు వైద్యాదికారి పలు సూచనలు వేశారు.