పాక్ పరాజయం; భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సెమీస్

fsipkm90అడిలైడ్ (మార్చి 20): పాకిస్తాన్‌తో ఇక్కడ జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితంతో భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య ఒక సెమీఫైనల్ మ్యాచ్ ఖాయమైంది. నేటి మ్యాచ్ సంగతి చూస్తే… టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు 49.5 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాక్ జట్టు బ్యాటింగ్ లైనప్ ఆసీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లో సొహైల్ చేసిన 41 పరుగులు, కెప్టెన్ మిస్బా ఉల్ హక్ చేసిన 34 పరుగులు మాత్రమే కాస్తంత చెప్పుకోదగిన అత్యధిక వ్యక్తిగత స్కోర్లు. 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట్లో తడబడింది. 10.5 ఓవర్లకే ఓపెనర్లు వార్నర్, ఆరాన్, కెప్టెన్ క్లార్క్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా… తర్వాత మైదానంలోకి వచ్చిన స్టీవెన్ స్మిత్ (65), షేన్ వాట్సన్ (64 నాటౌట్) అర్థ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ (35 నాటౌట్) మంచి ఇన్నింగ్స్ ఆడాడు.