పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత.
బూర్గంపహాడ్ జూలై 06(జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో టి.ఎస్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలను, ప్రాథమిక ఉన్నత పాఠశాలను స్థానిక జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు హాజరు అవుతున్నారని ప్రిన్సిపాల్ని వివరణ కోరారు. వర్షాకాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాఠశాల ఆవరణలో టాయిలెట్లను పారిశుధ్య కార్మికులచే ప్రతి రోజూ శుభ్రం చేయించాలని, పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బల్లలు, మంచినీటి వసతి లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. పాఠశాల ఆవరణలో శిథిలావస్థకు చేరిన భవనాలను పరిశీలించి, అనంతరం మధ్యాహన భోజనంపై విద్యార్థులను ఆరా తీసి వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాల గురించి, విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట స్థానిక సర్పంచ్ సిరిపురపు స్వప్న, టిఆర్ఎస్ మండల యువజన అధ్యక్షులు గోనెల నాని,టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం, స్థానిక సొసైటీ డైరెక్టర్ బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Attachments area