పాఠశాలలు బంద్ సంపూర్ణం
గత వారం రోజుల క్రితం రాజస్థాన్ రాష్ట్రంలో గల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కుల వివక్షతతో ఉపాధ్యాయుడికి సంబంధించిన కుండలోని మంచినీరు త్రాగాడనే కోపంతో దళిత బాలుడు మూడవ తరగతి చదువుతున్న ఇంద్ర కుమార్ మెగ్వాల్ అనే విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడం వలన ఆ విద్యార్థి చనిపోవడం విదితమే. . ఈ ఘటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ ఇవ్వడం జరిగిందని దళిత బహుజన ఐక్యవేదిక కోఆర్డినేటర్ పలిగిరి కనకరాజు తెలిపారు. ఇందులో భాగంగా రామకృష్ణాపూర్ పాఠశాలలు బందు పాటించి, సంఘీభావం తెలిపినందుకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.