పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు,పట్టించుకోని అధికారులు, అవస్థలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధికారులపై మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు

పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు,పట్టించుకోని అధికారులు, అవస్థలు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధికారులపై మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు

 

షీరాబాద్ సెప్టెంబర్ 23,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో శుక్రవారం రోజున రాత్రి పడిన వర్షనికీ పాఠశాలలో ఆవరణలో చేరిన వర్షపు నీరు.విద్యార్థులు పాఠశాల గదులకు వెళ్ళటానికి,పాఠశాల నుండి బయటకు వెళ్లడానికి విద్యార్థిలకు ఇబ్బంది కలుగుతుందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.మండల కేంద్రంలో ఉన్న బాలికల పాఠశాలలో మన ఊరి మనబడి లో ఎన్నో నిధులతో పనులు చేశారు.పాఠశాల ఆవరణలో మట్టి వేసి ఎత్తుగా చేయడం లేదు, సెప్టెంబర్ 4వ తేదీన జనం సాక్షి,మిగతా పత్రికలో రాయడం జరిగింది.అయినప్పటికీ మండల విద్యాధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి రేణుకా దేవి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని విద్యార్థి తల్లిదండ్రులు చింతిస్తున్నారు.ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ సమస్య ను పరిష్కరించాలని విద్యార్థి తల్లిదండ్రులు కోరారు.