పాఠశాల బస్సు బోల్తా: విద్యార్థిని మృతి

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విద్యార్థిని మృతిచెందగా, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాక్సిల్‌ విరగటంతో బస్సు కాలువలోకి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20మంది విద్యార్థులు ఉన్నారు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.