పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా గాంధీ చిత్రం చూస్తున్నారు

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో బాగంగా పాఠశాల విధ్యార్ధులకు మహాత్మా గాంధీ పై రూపొందించిన సినిమాను ఉచ్చితంగా తిలకించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యి రెండవ రోజు 3,872 మంది పిల్లలు , 105% హాజరై సినిమా తిలకించిన్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
సినిమా చూసేందుకు పిల్లలు ఉత్సాహంగా వస్తున్నారని వారికి అన్నీ ఏర్పాట్లు సంబందిత శాఖ వారు చూస్తున్నారని , ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసిన్నట్లు కలెక్టర్ తెలిపారు. వన మహోత్సవం సందర్భంగా ఈ రోజు జిల్లా కలెక్టర్ భువనగిరి మండల పరిధిలోని గౌస్ నగర్ లో మొక్కలు నాటి కార్యక్రమాని ప్రారంభించారు. 75 సం.రాలు పూర్తి అయిన సందర్భంగా దానికి గుర్తుగా 75 అక్షరం వచ్చే విధంగా చెట్లను నాటినట్టు, గౌస్ నగర్ లో ఫ్రీడం పార్క్ ను ప్రారంభించి అందుబాటులో ఉన్న ఖాళీ స్థలంలో 750 మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇదే మాదిరిగా జిల్లాలోని అన్నీ మున్సిపాలిటీ లలో, మండల కేంద్రాలలో, గ్రామాలలో 75 అక్షరం వచ్చే విధంగా మొక్కలు నాటేందుకు సంబందిత అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలియపృ. ఎక్కడ కూడా 75 కు తక్కువ కాకుండా మొక్కలు నాటేందుకు ఆదేశాలు జారీ చేసిన్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు స్థలాన్ని బట్టి ఎంట్రెన్స్ లో 75 అక్షరం వచ్చే విధంగా , వచ్చిన వారికి నేరుగా కనిపించే విధంగా మొక్కలు నాటేందుకు సంబందిత అధికారులు అందరూ కృషి చేయాలని , ఇది శాశ్వతంగా 75 సం.రాలు పూర్తి అయినది అనడానికి గుర్తుగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యకక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ ఛైర్మన్ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ కృష్ణయ్య, మున్సిపల్ కమీషనర్ నాగి రెడ్డి, అడిషనల్ డి ఆర్ డి ఓ , డీపీవో సునంద , జిల్లా ఉద్యాన శాఖ అధికారి అన్నపూర్ణ, ,ఎంపీపీ ,ఎంపీడీఓ , ఎంపీవో , సర్పంచ్, వార్డు మెంబర్లు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు