పాడి రైతుల సంక్షేమమే ధ్యేయం
కొహెడ : పాడి రైతుల సంక్షేమమె ధ్యేయంగా జిల్లా డెయిరీ పనిచేస్తుందని కరీంనగర్ జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘం ఛైర్మన్ సీహెచ్ రాజేశ్వరరావు తెలిపారు. కొహెడ పంచాయతీ పరిధిలో గల ధర్యసాగర్‌పల్లిలో రూ. 2,50 లక్షలతో నిర్మించునున్న భవనానికి ఆయన భూమి పూజ చేశారు. ఈసంద్భంగా ఆయన మాట్లాడుతూ తమ డెయిరీ నుంచి పాల ఉత్పత్తులను త్వరలోనే హైదరాబాద్ లో మార్కుటింగ్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలొ ఎండీ హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.