– పాత్రికేయులకు మహిళా ఎస్సై ఆత్మీయ పిలుపు
చండ్రుగొండ జనం సాక్షి (ఆగస్టు 13) : రక్షాబంధన్ విలువ తెలిసిన వారు రక్తసంబంధీకులకే రాఖీలు కట్టాలని అనుకోరు. సోదర భావంతో మెలిగే వారు ఎవరైనా రాఖీలు కట్టి ఆత్మీయతను చాటవచ్చని నిరూపించారు. స్థానిక మహిళా ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి చండ్రుగొండ మండలానికి మొట్టమొదటి మహిళా ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆమె పాత్రికేయులకు రాఖీ కడుతాను అన్నయ్యా అంటూ ఆత్మీయంగా పిలిచారు. ఆమె పిలుపు మేరకు స్పందించిన పాత్రికేయులు కుల మతాలకు అతీతంగా రాఖీలు కట్టించుకుని అన్నా చెల్లెలు అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ఆత్మీయత అనురాగాలను పంచారు. దాంతో నిత్యం సమస్యలు పరిష్కారాల స్టేషన్ వాతావరణంలో ఒక్కసారిగా అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల ఆత్మీయానురాగాలు కనిపించాయి. ఒకవైపు అక్కగా చెల్లిగా ఆత్మీయతను పంచుతూ మరోవైపు ఫ్రెండ్లీ పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తించిన ఎస్ఐ విజయలక్ష్మి కు జనం సాక్షి హ్యాట్సాఫ్