పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
రియో పారాలింపిక్స్‌లో భారత జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝారియా ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. రియో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో దేవేంద్ర జఝారియా గోల్డ్ మెడల్ సాధించాడు. జావెలిన్ త్రో ఎఫ్ 46 ఈవెంట్లో దేవేంద్ర 63.97 మీటర్లతో సరికొత్త ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. గతంలో 2004 ఏథెన్స్ పారా ఒలింపిక్స్ లో 62.15 మీటర్లతో స్వర్ణం గెలిచిన దేవేంద్ర మరోసారి తన రికార్డ్ తానే బద్దలు కొట్టాడు. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. ఓవరాల్‌గా ఈ పారాలింపిక్స్ లో భారత్ రెండు స్వర్ణాలతో పాటు ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది.