పారా ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత్
రియో పారా ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. పోటీల రెండో రోజునే రెండు మెడల్స్ భారత్ ఖాతాలో చేర్చారు. ఈ రెండు మెడల్స్ కూడా హైజంప్ లోనే వచ్చాయి. పురుషుల హైజంప్ విభాగంలో ఫైనల్ కు అర్హత సాధించిన మరియప్ప, వరుణ్ సింగ్ మెడల్స్ తో మెరిశారు. మరియప్ప 1.89 మీటర్ల ఎత్తు దూకి స్వర్ణాన్ని అందించగా, 1.86 మీటర్లు నమోదుచేసిన వరుణ్ సింగ్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకున్నాడు.