పారిశ్రామిక కారిడార్‌గా అమరావతికి ఛాన్స్‌

జిల్లాకో పరిశ్రమతో స్థానిక నిరుద్యోగానికి చెక్‌
అమరావతి,డిసెంబరు7(జ‌నంసాక్షి): అమరావతిని అద్బుత నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన సిఎం చంద్రబాబు ఆమేరకు ఉపాధి కల్పనకు కూడా భారీగా కసరత్తు చేస్తున్నారు. కుటీర పరిశ్రమలు మొదలు భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా నిరుగ్యో సమస్యకు చెక్‌ పెట్టాలని చూస్తున్నారు. వివిధ జిల్లాల్లో సెజ్‌ల ఏర్పాటుతో పాటు అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోకి భారీ పరిశ్రమలు వచ్చేలా ప్రణాళికలు సిద్దంచేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు బాపులపాడు మండలం మల్లవల్లి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాయి. కియో పరిశ్రమతో ఇప్పటికే అనంతపురం హబ్‌గా మారింది. దీంతో పాటు అన్ని జిల్లాల్లో ఇలా పరిశ్రముల తీసుకుని రావడం ద్వారా  పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అన్ని అవకాశాలు ఉన్నా భారీ పరిశ్రమలు తక్కువ సంఖ్యలో ఉండటంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. సిమెంట్‌ ఫ్యాక్టరీలు, చక్కెర కర్మాగారాలు తప్పితే పెద్దగా చెప్పుకోవటానికి కూడా లేవు. మల్లవల్లిలో భూములు ఉండటం, మౌలిక సదుపాయాల కోసం ఏపీఐఐసీ చర్యలు చేపడుతుండటంతో పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో మల్లవల్లి సవిూప ప్రాంతాలలో ఏపీఐఐసీ భారీ స్తాయిలో భూ బ్యాంక్‌ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వల్లవల్లిలోనే మెగా ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి , కృష్ణాజిల్లా యంత్రాంగం ఇటీవల 110 ఎకరాలను కేటాయించింది. మొత్తం భూములలో 58 ఎకరాలను ఫుడ్‌పార్క్‌కు కేటాయించారు. మిగిలిన 42 ఎకరాలను ఫుడ్‌ ఇండస్టియ్రల్‌ పార్క్‌కు కేటాయించాలని నిర్ణయించారు. ఫుడ్‌ ఇండస్టియ్రల్‌ కారిడార్‌కు సంబంధించి ఇప్పటికే మూడు ప్రధాన సంస్థలు ముందుకు వచ్చినట్టు సమాచారం.  బంగారు శుధ్ధి ప్లాంట్‌ , మోటార్‌ వెహికల్‌ బాడీ బిల్డంగ్‌ యూనిట్‌, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీస్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. దేశంలోనే అత్యున్నత సంస్థలు వీటి ఏర్పాటుకుఏపీఐఐసీకు ప్రతిపాదనలు చేశాయి.మల్లవల్లిలో గోల్డ్‌ ర్గి/నైరీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 30 ఎకరాల కోసం ప్రతిపాదించింది. అశోక్‌ లేల్యాండ్‌ కంపెనీ దక్షిణ భారత స్థాయిలో వెహికల్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ఏర్పాటుకు 100 ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. కుమార్‌ – సింటెక్స్‌ సంస్థ కూడా భారీ యూనిట్‌ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సింటెక్స్‌ పేరుతో ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడే తయారు చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది. దీని కోసం వంద ఎకరాలు కావాలని ప్రతిపాదించింది. ఇంకా అనేక సంస్థలు ఇటు వైపు చూస్తున్నాయి. త్వరలోనే వాటి నుంచి కన్ఫర్మేషన వచ్చే అవకాశం ఉంది. వల్లవల్లిలో ఫుడ్‌ పార్క్‌కు కేటాయించిన భూములు మినహాయిస్తే ప్రస్తుతం 1250 ఎకరాల ల్యాండ్‌బ్యాంక్‌ ఉంది. భారీ పరిశ్రమల స్థాపనకు ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుంటే ఈ భూములు పది సంస్థలకు కూడా సరిపోయే పరిస్థితి లేదు. పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి ఒక్కో సంస్థ సగటున వంద ఎకరాలకు తక్కువ కాకుండా ప్రతిపాదిస్తోంది.