పార్కులపై వాతావరణ మార్పుల ప్రభావం: ఒబామా
వాషింగ్టన్: వాతావరణ మార్పుల ప్రభావం పార్కులపై ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ఒబామా హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాలోని అనేక పార్కులు వాతావరణ మార్పులకు గురవుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన పార్కుల్లో కాలిఫోర్నియాలోని యోస్మైట్ జాతీయ పార్కు ఒకటని, శనివారం పార్కు సందర్శనలో చెప్పారు. పార్కులపై వాతావరణ మార్పుల ప్రభావం గొప్ప సవాలుగా మారిందన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో మానవమనుగడకు కచ్చితంగా నష్టం జరుగుతుందని అంతేకాకుండా ప్రపంచంలో 740 మీటర్ల ఎతైన యోస్మిట్ జలపాతాన్ని తట్టుకునే సెంటినెల్ బ్రిడ్జి గురించి వివరించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ జలపాతం నుంచి అనేక పక్షులు ఉత్తర ప్రాంతానికి వలస పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వైట్‌హౌస్ నివేదిక ప్రకారం.. 2015లో 305 మిలియన్ల కంటే ఎక్కువ మంది పర్యటకులు ఈ జాతీయ పార్కులను సందర్శించారు.