పార్థా ఛటర్జీకి దండిగా మమత అండదండలు
ఆమె వెనకుండి చక్రం తిప్పేదీ ఛటర్జీయే
అవినీతి వ్యవహారంపై నోరు మెదపని శివంగి
మమత కనుసన్నల్లోనే అవినీతి అంటూ లెఫ్ట్ నేతల విమర్శలు
కోల్‌కతా,ఆగస్ట్1 జనంసాక్షిః బెంగాల్లో అవినీతి వ్యవహారంతో సిఎం మమతా బెనర్జీ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యింది. రాష్ట్రంలో అవినీతి ఊడలు దిగినా పట్టించుకోని వైనం మమత చూపింది. మంత్రి పార్థా చటర్జీ అవినీతిలో కూరుకుపోయి అడ్డంగా బుక్కయినా కనీసంగా స్పందించలేదు. పార్థా చటర్జీని అరెస్టు చేసిన వెనువెంటనే … ఆయనను మంత్రివర్గంలోంచి తొలగించకుండా జాప్యంచేయడం ఆమె ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్టగాచెప్పుకోవాలి. పార్థా చటర్జీ కొన్నేళ్లుగా మమతకు కుడిభుజంగా చక్రం తిప్పుతు న్నవాడే. ఆమెకు తెలియకుండానూ ఆమె పాత్ర లేకుండానూ ఇంత పెద్ద కుంభకోణం ఇంత కాలం సాగడం అసంభవం. అవినీతి సొమ్ము అపారంగా కలిగివున్న మమతను కాపాడేందుకు ఇప్పుడు అనేక విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనేక రకాలైన మాఫియా ముఠాలతో తృణమూల్‌కు సంబంధాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ కుంభకోణంలో దోషులందరని బోనెక్కించాల్సిందే. మొన్నటి దాకా జాతీయ ప్రత్యామ్నాయ నేతగా ప్రచారం చేసుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా ఉనికిని కాపాడుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. నిరాడంబర మూర్తిగా, నీతినిజాయితీల నిప్పుకణికగా ఆమెను చిత్రించిన విూడియా ఇప్పుడు మౌనం దాల్చింది. మూడున్నర దశాబ్దాల వామపక్ష సంఘటన పాలనను బద్దలు కొట్టిన నేతగా పేరు గడిరచి ప్రజలకు ఆశాదీపంగా కనిపించిన దీదీ ఇప్పుడు చిక్కుల్లో చిక్కిపోయారు. రోత పుట్టించే స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో పుట్టలు పుట్టలుగా కోట్లు బయిటపడ్డాక తృణమూల్ సర్కార్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిలిచిన మాజీ మంత్రి పార్థా చటర్టీ అరెస్టు, యాభై కోట్ల పట్టివేత తర్వాత మమతా బెనర్జీమౌనం వహించారు. 2014 లోనే బయిటకొచ్చిన ఈ కుంభకోణంపై నిరసన కొనసాగుతున్నా
ప్రభుత్వం సరిదిద్దుకోకపోగా సమర్థనలతో సరిపెట్టింది. 2018 నాటికి ఇది తీవ్ర రూపం తీసుకుంది. సిపిఎం ఎం.పి వికాస్ రంజన్ భట్టాచార్య హైకోర్టులో కేసు వేశారు. మరోవంక నష్టపోయినవారి నిరసన దీక్షలు కొనసాగాయి. రాష్ట్రం మూలమూలలా ఈ స్కామ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలశాయి. నినాదాలు హోరెత్తాయి. అప్పటి నుంచి అటు ప్రత్యక్ష పోరాటం ఇటు న్యాయపోరాటం కూడా ఉధృతమవుతూ వచ్చాయి. బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు మమత చెబుతున్నా అవినీతిపై సొంత రాష్ట్రంలోనే చర్యలు తీసుకోలేని దుర్బల సిఎంగా మమత నిలిచారు. శారదా స్కాం, నారదా స్కాం ఇంకా వివిధ సంస్థల్లో అక్రమాలకు పాల్పడిన ముఖ్య నేతలు నెమ్మదిగా బిజెపిలో చేరి దర్యాప్తును తాత్కాలికంగా తప్పించుకున్నారు. ఎస్‌ఎస్‌సి పాఠశాల టీచర్ల నియామకం కోసం పరీక్షలు నిర్వహిస్తుంది. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక కొద్ది కాలంలోనే ఇదంతా గోల్‌మాల్‌గా మారింది. నియామకం కోసం పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఉద్యోగాలు రాకపోగా అంతు తెలియని రీతిలో వెనకనున్న వారు అవలీలగా పోస్టులు సంపాదించారు. 2013లో టెట్ ఫలితాలలో కేవలం 1.07 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించినట్టు ప్రకటించారు. 55 లక్షల మంది అభ్యర్థులు రాసినట్టు మొదట వివరాలు రాగా తర్వాత హఠాత్తుగా 45 లక్షల మంది మాత్రమే రాసినట్టు ప్రకటించారు. తర్వాత 17 లక్షల 72 వేలకు కుదించారు. 18,792 మంది అర్హత సాధించారని వెల్లడిరచారు. ఇదంతా పెద్ద బూటకమని, పరీక్షా పత్రాలను తృణమూల్ కార్యాలయంలోనే దిద్దారని కూడా బహిర్గత మైంది. తద్వారా తమ బంధుమిత్రులను, కార్యకర్తలను మాత్రమే ఎంపిక చేశారు. కల్నా నియోజక వర్గ ఎంఎల్‌ఎ కుటుంబంలో ఎనిమిది మందికి పోస్టింగులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ముకుల్ రాయ్, పార్థా చటర్జీ, మదన్ మైత్రాల కమిటీ ఈ నియామకాలు ఖరారు చేసింది. 2014 లోనే బయిటకొచ్చిన ఈ కుంభకోణంపై నిరసన కొనసాగుతున్నా ప్రభుత్వం సరిదిద్దుకోకపోగా సమర్థనలతో సరిపెట్టింది. 2018 నాటికి ఇది తీవ్ర రూపం తీసుకుంది. రాష్ట్రం మూలమూలలా ఈ స్కామ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలశాయి. నినాదాలు హోరెత్తాయి. అప్పటి నుంచి అటు ప్రత్యక్ష పోరాటం ఇటు న్యాయ పోరాటం కూడా ఉధృతమవుతూ వచ్చాయి. మమత మూడోసారి గెలిచాక కోర్టులో విచారించే న్యాయమూర్తులు కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు మమత చెబుతున్నా తన సొంత రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించారు. అనేక అవినీతి వ్యవహారాలు బయిటపెడుతున్నా కేంద్రం సకాలంలో చర్యలు తీసుకోలేదు. శారదా స్కాంలో చిట్‌ఫండ్ వ్యాపారం సొమ్మును విూడియా లోకి మళ్లించడం, మమత అనుకూల ప్రచారంతో ఓటర్లను మభ్యపెట్టడం వీరి వ్యూహంగా నడిచింది. సింగూరు నందిగ్రామ్‌లపై దుష్పచ్రారంతో వెలుగులోకి వచ్చిన మమతా బెనర్జీ అవినీతికి కేంద్రమయ్యింది. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులన్నీ కలసి మమతను గెలిపించారు. సాదా చీర, సామాన్యమైన ఇల్లు అంటూ ఆమె నిరాడంబరతను వేనోళ్ల కీర్తిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. వ్యక్తిగత నిరాడంబరత మాటున అవినీతిని ప్రోత్సహించారు. పార్థా చటర్జీ సన్నిహితురాలైన మాజీ నటి అర్పితా ముఖర్జీ ఇంటిపై దాడి చేసినపుడు అదే విధంగా గది నిండా దాచివున్న రూ.21 కోట్ల నగదు పట్టుబడిరది. అక్కడ దొరికిన వివరాలతో మరో దాడి చేస్తే ఇంకో 29 కోట్లకు పైగా దొరికింది. బంగారం, ఖరీదైన కానుకలు, విలువైన పెయింటింగులకు లెక్కే లేదు. ఇంత ప్రత్యక్షంగా నోట్ల కట్టలతో దొరికిపోయిన సందర్భాలు అరుదు.