పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు
పార్లమెంట్‌లో ఇష్టానుసారం మాట్లాడడం కుదరదు
అన్‌పార్లమెంట్ పదాల జాబితా విడుదల
న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి): పార్లమెంట్‌లో సభ్యులు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం ఇక కుదరదు. అన్ పార్లమెంటరీ పదాలను వాడితే సభ్యులపై చర్యలు తప్పవు. లోక్‌సభ, రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడొద్దని ఎంపీలకు లోక్‌సభ సెక్రటేరియట్ సూచించింది. ఈ మేరకు ఓ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. సిగ్గులేదు, ధోకేబాజ్, అసమర్థుడు, నాటకం, నటన, అవినీతి పరుడులాంటి మరిన్ని పదాలను బుక్ లెట్ లో చేర్చింది. కరప్ట్, కవర్డ్, హూలిగనిజం, బ్లడీ, బీట్రేడ్, అషేమ్డ్, హిపోక్రసీ, మిస్‌లీడ్, లై, క్రొకొడైల్ టియర్స్, బ్లడ్‌షెడ్, డాంకీ, డ్రామా, అప్‌మాన్, కాలా బజారీ, చంచా, చంచాగిరి, అబ్యూస్డ్, చీటెడ్, క్రిమినల్, గూన్స్, దలాల్, దాదాగిరీ, లాలీపాప్, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, బేహ్రీ సర్కారు, బాబ్‌కట్, జుమ్లాజీవీ, శకుని, విశ్వాస్‌ఘాత్, సంవేదన్‌హీన్, ఐవాష్, అన్‌ట్రూ, కోవిడ్ స్పెడ్రర్, గిర్గిట్, బేచారా, అసత్య, అహంకార్ వంటి ఇంగ్లీషు పదాలను అందులో చేర్చారు. ఈనెల 19వ తేదీ నుంచి వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అన్ని పార్టీల కీలక నేతలతో ఈ నెల 17న ఉదయం సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడిరచారు. ఎజెండాపై చర్చ, సమావేశాలు సజావుగా జరగడానికి అన్ని పార్టీల మద్దతును కోరనున్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌హాజరుకానున్నారు. కాగా, పార్టీల ఎª`లోర్ లీడర్ల సమావేశాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జూలై 16న సాయంత్రం ఏర్పాటు చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు 17న సాయంత్రం వివిధ పార్టీల ప్లోర్ లీడర్లతో సమావేశం కానున్నారు. ఈ నెల 18న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగుతాయి.