పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు ఉద్యమం : కోదండరామ్
పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ ఉద్యమం
– టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 28 (జనంసాక్షి) :
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశ పెట్టే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. తెలంగాణపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నార్త్ బ్లాక్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం సందర్భంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణపై తేల్చాలని డిమాండ్ చేశారు. యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఇంకా తెలంగాణ విషయంలో మోసపుచ్చే వైఖరి ప్రకటిస్తే ప్రజలు క్షమించబోరన్నారు.