పార్లమెంట్‌లో ‘సమైక్య’ ప్లకార్డు పట్టిన జగన్‌ పార్టీ

తెలంగాణలోకి ఎట్ల వస్తరు
వైఎస్సార్‌ సీపీ కార్యాలయాన్ని ముట్టడించిన టీ అడ్వకేట్‌ జేఏసీ
హైదరాబాద్‌, జూలై 22 (జనంసాక్షి): తెలంగాణలో రాజకీయంగా బలపడేందుకు వైఎస్సార్‌సీపి చేపట్టిన చేనేత దీక్షకు ఆ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ హాజరవ్వడంపై సర్వత్రా నిరసన వెల్లువలెత్తుతున్నాయి. నేడు తపపెట్టనున్న చేనేత కార్మికుల మద్దతుగా దీక్ష వ్యతిరేకంగా ఆదివారం నాడు తెలంగాణ అడ్వకేట్స్‌ ఆ పార్టీ కార్యాల యాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో ప్లకార్డులు చూపిప వైఎస్‌ జగన్‌ తెలంగాణకు వచ్చినపుడు తెలంగాణవాదుల్లో ఎంత వ్యతిరేకత చవిచూశారో తెలిసి మళ్లీ తెలంగాణపై ఎలాంటి స్పష్టమైన వైఖరి తెల్పకుండా కేంద్రానికి లేఖ ఇవ్వకుండా వైఎస్‌. విజయమ్మ ఎలా వస్తుంది అని ప్రశ్నించారు. ఆమే తీరు మారకుండా దీక్ష చేపట్టడానికి వస్తే తెలంగాణవాదుల తడాఖా ఏమిటో ఆమేకు చూపిస్తామన్నారు. తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టే నైతిక విలువ వైఎస్సార్‌ సీపీ పార్టీ అధ్యక్షురాలికి లేదని విమర్శించారు.