పార్లమెంట్‌ ఆవరణంలో కొనసాగిన.. 

తెదేపా ఎంపీల ఆందోళ
– విభజన చట్టంలోని హావిూలు అమలు చేయాలని డిమాండ్‌
– మాయల ఫకీరు వేషదారణలో ఎంపీ శివప్రసాద్‌
న్యూఢిల్లీ, ఆగస్టు2(జ‌నం సాక్షి) : విభజన హావిూలు నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఎంపీలు గురువారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాలంటూ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఎంపీలు మురళీమోహన్‌, గెల్లా జయదేవ్‌, రాంమోహన్‌నాయుడు ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ విభజన చట్టంలోని హావిూలను అమలు చేయకుండా కేంద్రం ఏపీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందన్నారు. ప్రత్యేక ¬దా కల్పించాలని పార్లమెంట్‌ సాక్షిగా చేసిన తీర్మానాన్నిసైతం కేంద్రం తుంగలో తొక్కుతుందన్నారు. ఏపీ ప్రజల పట్ల కక్షపూరితంగా బీజేపీ వ్యవహారశైలి ఉందన్నారు. కేంద్రం ఇప్పటికైన స్పందించి ఏపీ ప్రజలను ఇబ్బందులను గుర్తించి వెంటనే ప్రత్యేక ¬దా హక్కు కల్పించాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. మరో వైపు మరో ఆసక్తికర వేషధారణలో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అందరినీ ఆకట్టుకున్నారు. మాయల ఫకీరు వేషధారణలో పార్లమెంటు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. కాళీ మాత వర ప్రసాదంతో ఏపీకి మంచి చేయడానికి వచ్చిన మంచి ఫకీరునని ఆయన అన్నారు. ఎన్నికలు హావిూ ఇచ్చిని మోదీ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలా చేస్తే ఒక్కో తెలుగువాడిని తోటరాముడిని చేసి మోదీ పైకి వదులుతానంటూ ఛలోక్తులు విసిరారు. తనకన్నా పెద్ద మాయల ఫకీరు పార్లమెంటులో ఉన్నాడంటూ ఎంపీ శివప్రసాద్‌ ఛలోక్తులు విసిరారు.
—————————-