పార్లమెంట్ ఎదుట టీడీపీ ధర్నా
ఢిల్లీ: రిటైల్ రంగంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఒకటో నంబర్ గేటు వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో నీలం తుపానును జాతీయ విపత్తుగా గుర్తించి రైతులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని ఎంపీలు నినాదాలు చేశారు.