పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన
న్యూఢిల్లీ: చిల్లవర్తకంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో నేతలు మన్మోహన్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నీలం తుపాను బాధిత రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేపట్టారు.