పార్లమెంట్‌ భవనంలో రాష్ట్రపతి ఎన్నిక

తొలుత ఓటేసిన ప్రధాని మోడీ
తరవాత ఓటేసిన మంత్రులు, ఎంపిలు

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి

):రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత ప్రధాని మోడీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌లోని రూమ్‌ 63లో ఈ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలైన్లలో నిలబడి ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్‌ సహా ఆయా రాష్టాల్ర అసెంబ్లీల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియగించుకున్నారు. సీక్రెట్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ విధానంలో పోలింగ్‌ జరుగుతోంది. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలు రూపొందించారు. 4809 మంది ఎలక్టరోరల్‌ కాలేజి సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు. ఎన్నికల బరిలో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము , ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ఉన్నారు. కాగా ఎన్డీఏ భ్యర్థి ముర్ముకే సంఖ్యాబలం అనుకూలంగా ఉంది. ముర్ముకు ఎన్డీఏ పక్షాలతో పాటు వైసీపీ, టీడీపీ, శివసేన, బీజేడీ మద్దతు ఇస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగతుంది. ఈ నెల 21న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు.