పార్లమెంట్‌ స్తంభింపజేస్తం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే తెలంగాణ లేదంటరు
తస్మాత్‌ జాగ్రత్త  !  : కేసీఆర్‌
కరీంనగర్‌సిటీ, ఫిబ్రవరి 16 (జనంసాక్షి) :
తెలంగాణ సాధన కోసం పార్లమెంట్‌ను స్తంభిం పజేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సోమ వారం కరీంనగర్‌ శివారులోని తీగల గుట్టపల్లిలో గల ఉత్తర తెలంగాణ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేసేలా వ్యవహ రిస్తోందని అన్నారు. ప్రజల పక్షాన తెలంగాణవాదులు రోడ్లపై ఉండి ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పదువులు పట్టుకు వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిడితోనే తెలంగాణ సాధ్యమ వుతుందని
తెలిపారు. ఈనెల 21న జరిగే శాసనమండలి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి సమైక్యవాదులకు, ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెప్పాలని కోరారు. ఇప్పుడు తెలంగాణ సాధనలో ఎన్నికలకు ప్రాముఖ్యత ఉందన్నారు. వంద ఎమ్మెల్యే, 15కు పైగా ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలను కూడా పార్టీ ప్రాతిపదికన నిర్వహించాలని కోరారు. కాంగ్రెస్‌ ఇప్పటికైనా తెలంగాణ ఇస్తే గతంలో తామిచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. త్వరలో ఎమ్మెల్యేల కోటాలో నిర్వహించనున్న శాసన మండలి స్థానానికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పార్టీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మహమూద్‌ అలీని అభ్యర్థిగా ప్రకటించారు. నాగం జనార్దన్‌రెడ్డి తమకే మద్దతు ఇస్తారని, తెలంగాణ కోరుకునే వారు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో నాయకులు ఈటెల రాజేందర్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, కేటీఆర్‌, స్వామిగౌడ్‌, లక్ష్మారెడ్డి, ఈద శంకర్‌రెడ్డి, వినోద్‌, రవీందర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.