పాలన చేతగాకపోతే దళితుడికి సిఎం పదవి అప్పగించాలి
మాట ఇవ్వడం మర్చిపోవడం కెసిఆర్‌కు అలవాటు
వరదబాధితులను పరామర్శించిన వైఎస్ షర్మిల
భద్రాద్రి కొత్తగూడెం,జూలై23(జనంసాక్షి): విూకు పరిపాలన చేతకాకపోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండిని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. తక్షణ సహాయం చేయలేని విూరు, ముఖ్యమంత్రిగా ఎందుకున్నారని ప్రశ్నించారు. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారని గుర్తు చేశారు. శనివారం పినపాక మండలం రావి గూడెం గ్రామంలో పర్యటించిన షర్మిల గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను పరిశీలించారు. గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారని మండిపడ్డారు. నష్టపరిహారం ఇస్తామని హావిూ ఇవ్వడం.., మర్చిపోవడమే కేసీఆర్‌కు మాత్రమే తెలుసన్నారు. గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారన్న ఆమె… విూడియా ముందు మాట్లాడుతారు.. ఫామ్ హౌజ్ కి వెళ్లి పడుకుంటారని విమర్శించారు. ఇప్పటికే లక్షల మంది జీవితాలు ఆగమయ్యాయని, ఇస్తామని చెప్పిన 10 వేల సహాయం కూడా ఇంకా అందలేదని ఆరోపించారు. పదివేలు కూడా సరిపోవన్న షర్మిల.. రూ.25 వేలు సహాయం అందించాలని డిమాండ్ చేశారు. సహాయం అందిస్తామని రబ్బర్ బియ్యం ఇచ్చారని బాధితులు చెప్తున్నారని షర్మిల చెప్పుకొచ్చారు. అయినా విూరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారని ప్రశ్నించారు. ఇలా ఇచ్చిన ఒక్క హావిూని కూడా నిలబెట్టుకోక పోతే ఎలా ముఖ్యమంత్రి గారు అంటూ ఎద్దేవా చేశారు. వీరితో పాటు పంట నష్టపోయిన రైతులక్కూడా వెంటనే పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇస్తామని హావిూ ఇవ్వడం..మరిచి పోవడమే కేసీఆర్ కు తెలుసని షర్మిల విమర్శించారు.విూడియా ముందు మాట్లాడుతారని.. ఫామ్ హౌజ్‌లో పడుకుంటారని దుయ్యబట్టారు. వరదలతో ప్రజలు సర్వం కోల్పోయారన్నారు. తక్షణ సహాయం చేయలేని ముఖ్యమంత్రిగా విూరు ఎందుకు ఉన్నారని వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రశ్నించారు. విూకు పరిపాలన చేతకాక పోతే రాజీనామా చేసి దళితున్ని ముఖ్యమంత్రి చేయండి. విూరు ఇంకా పదవిని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నారు. లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయి. ఇస్తామని చెప్పిన రూ.10 వేల సహాయం కూడా ఇంకా అందలేదు. 10 వేలు ఎటూ సరిపోవు.. రూ.25 వేలు సహాయం అందించాలి. సహాయం అందిస్తాం అని రబ్బర్ బియ్యం ఇచ్చారని బాధితులు చెప్తున్నారు. ఇచ్చిన ఒక్క హావిూ కూడా నిలబెట్టు కోకపోతే ఎలా ముఖ్యమంత్రి గారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి‘ అంటూ షర్మిల డిమాండ్ చేశారు.