పిచ్చికుక్కల దాడిలో 45 గొర్రెలు మృతి

చిర్యాలటౌన్‌, జనంసాక్షి : మంచిర్యాల పట్టణంలోని రంగపేట గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్కలు దాడిలో 45 గొర్రెలు మృతి చెందాయి. ఈ సందర్భంగా గొర్రెల యజమాని కొమిరే రాజమల్లు మాట్లాడుతూ తన ఇంటి పక్కన గొర్రెల దొడ్డిలో 150 గొర్రెలు ఉన్నాయని, రాత్రి కుక్కలు దొడ్డిలో చొరబడి 45 గొర్రెలపై దాడి చేయడంతో మృతిచెందాయని పేర్కొన్నారు.గమనించి పిచ్చి కుక్కలను తరిమే లోపే 45 గొర్రెలు మృతిచెందాయని పేర్కొన్నారు. ఒక్కొక్క గొర్రెకు రూ. 4 నుంచి మంచిర్యాల మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నిరు. ప్రభుత్వం బాధితుడికి ఆర్థిక సాయం అందించి, పిచ్చికుక్కల బెడద లేకుండా మున్నిపల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు.