పిట్టల వాడ సమస్యలను పరిష్కరించాo

పల్లె ప్రగతి లో గుర్తించిన సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం దండు పల్లి గ్రామం ఆమ్లెట్ అయినా పిట్టల వాడలో గ్రామ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు . 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం లో భాగంగా మొదటి రోజు  గుర్తించిన పలు సమస్యలను అన్ని  పరిష్కరించాలన్నారు  గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుండి నడిపిస్తున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ పంజా లక్ష్మీ ని  ,  గ్రామ పెద్దలు బిక్షపతి  గ్రామ కార్యదర్శి హేమలత గ్రామ ఉప సర్పంచ్ మహేందర్ గౌడ్ ని , మరియు గ్రామ అభివృద్ధికి తోడ్పడే ప్రతి ఒక్కరినీ శాలువా తో సన్మానించ రూ వర్షపు నీరు నిల్వ ఉన్న  గుంతలలో దోమలు పునరుత్పత్తి చెందకుండా ఆయిల్ బాల్స్ ను వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి , రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బాలయ్య పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.