పిడుగుపాటుకు యువతి మృతి

కామారెడ్డి,జూలై18(జనంసాక్షి): బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో పిడుగుపడి యువతి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మ్యాడ శ్రీనివాస్‌ ఆదివారం మధ్యాహ్నం తన కూతుళ్లు శివాని(21), అర్చనతో పొలంలో మందు చల్లేందుకు వెళ్లాడు. వర్షం రావడంతో చెట్టు కింద నిల్చున్నారు. పిడుగు పడడంతో శివాణి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాస్‌, అర్చనకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.