పిల్లలకు దేశభక్తిని పెంపొందించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య

టేకులపల్లి, ఆగస్టు 10( జనం సాక్షి ): దేశం కోసం పోరాటాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను పిల్లలకు వివరిస్తూ వారిలో దేశభక్తిని పెంపొందించే విధంగా సన్నద్ధం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న భారత స్వాతంత్ర 75వ వార్షకోత్సవ దినోత్సవాల్లో భాగంగా బుధవారం టేకులపల్లి మండలం రోళ్ళపాడు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన వజ్రోత్సవ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశానుసారం గ్రామ గ్రామాన తప్పనిసరిగా 75వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసరావు,ఎంపిడిఓ బాలరాజు, ఏపీఓ శ్రీనివాస్,ఫారెస్ట్ సిబ్బంది,స్థానిక ప్రజాప్రనిధులు,తెరాసా నాయకులు తదితరులు పాల్గొన్నారు.