పి డి ఎస్ యు రాష్ట్ర మహాసభల పోస్టర్స్ ఆవిష్కరణ
టేకులపల్లి, నవంబర్ 1( జనం సాక్షి ): టేకులపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు పి డి ఎస్ యు రాష్ట్ర మహసభల పోస్టర్లు మంగళవారం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు జె చంద్రకళ మాట్లాడుతూ
దేశభక్తి, జాతీయతను పునికి పుచ్చుకొని దేశంలో జరిగిన వివిధ రైతాంగ, కార్మిక పోరాటల స్ఫూర్తితో సమ సమాజ స్థాపన ధ్యేయంగా, శాస్త్రీయ విద్యా లక్ష్యంగా ఆవిర్భవించిన పి టి ఎస్ యు విద్యారంగంలో సమూల మార్పు కై నాటి నుంచి నేటి వరకు పోరాడుతుందని ముఖ్యంగా విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేట్కరణ, కాషాయీకరణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ విద్య బలోపేతం కై అందరికీ సమాన విద్య లక్ష్యంతో ప్రయాణిస్తుందని, లక్ష్యసాధనలో ఎంతోమంది విద్యార్థి వీర కిశోరాలు అమరత్వం పొందారని, ఎన్ని నిర్బంధాలను ఎదుర్కొంటున్న ఏనాడు వెనకడుగు వేయలేదని విప్లవస్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పట్టణంలో నవంబర్ 3,4,5 తేదీలలో తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలను జరుపుకుంటుందని ఈ సందర్భంగా విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి డి మహేష్, నాయకులు అఖిల, శృతి, నరసింహ, సమత, స్వరుప, సంగీత తదితరులు పాల్గొన్నారు.