పునరావాస గ్రామాలపై నిర్లక్ష్యం తగదు

ఏలూరు,జూలై27(జ‌నంసాక్షి): పునరావాస గ్రామాల్లో మౌలికసదుపాయల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామ్‌ అన్నారు. ప్రజలకు అన్యాయం జరక్కుండా కఠిన చర్యలు తీసుకుంటామని గతంలో జెసి ఇచ్చిన హావిూ అమలు కావడం లేదన్నారు. పునరావాస గ్రామాల్లో విద్యుత్‌, తాగునీరు, డ్రెయినేజీలు, నిర్మించాలని అన్నారు. కేవలం ఇళ్ల కేటాయింపు చేసి ఊరుకోకుండా సౌకర్యాలు కలిగించాన్నారు. నిర్వాసితులను పునరావాస గ్రామాలకు తరలించినప్పటి నుంచి వారి సమస్యలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని అన్నారు. ఇకముందు ఏ సమస్య గురించి అయినా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు కఠినంగా ఉంటాయని జెసి హెచ్చరించారు. పునరావాలస గ్రామాల్లో చెత్తను డంపింగ్‌యార్డ్‌కు తరలించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పునరావాలస కాలనీల విషయంలో బాధ్యులైన ప్రతిఅధికారి వద్ద నుంచి వారుచేసిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం విడుదల చేయాలని సిపిఎం కార్యదర్శి డిమాండ్‌ చేశారు. కొందరు భూస్వాములు పేదలకు పరిహారం ఇస్తే తమ భూమిలోకి కూలీలు రారని ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. పరిహారం విడుదల కాకపోవడానికి ఏదైనా కారణాలున్నాయో తెలపాలని ప్రశ్నించారు. తక్షణం పునరావాస పరిహార లబ్ధిదారుల జాబితాను విడుదల చేయాలని కోరారు. పునరావాస ప్యాకేజీ తెలంగాణలో కుటుంబానికి రూ.12 లక్షల 50 వేలు ఇస్తున్నారని ఇక్కడ కూడా అదే ప్యాకేజీ ఇవ్వాలన్నారు. గిరిజనులకు భూమికి భూమి, బుట్టాయ గూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఇచ్చి, పునరావాస కాలనీలు కుక్కునూరులో నిర్మిస్తే వ్యవసాయం ఎలా చేయగలరని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చుట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.

తాజావార్తలు