పురందేశ్వరికి ప్రమోషన్
న్యూఢిల్లీ: కేంద్ర సహాయ మంత్రి పురందేశ్వరికి ప్రమోషన్ లభించింది. ఈ నెల 28న జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో పురందేశ్వరికి వాణిజ్య పన్నుల శాఖ సహాయ మంత్రిగా చోటు దక్కింది. ఈ శాఖపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆమెకు తాజాగా ప్రమోషన్ లభించింది. జౌళి శాఖకు స్వతంత్ర హోదాలో పురందేశ్వరిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు పురందేశ్వరికి ప్రధాని నేరుగా ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.