పురుషోత్తపట్నంతో ప్రయోజనాలు కనిపిస్తున్నాయి

కాకినాడ,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలించిన ప్రభుత్వం ఇప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టడంతో ఎంతో మేలు జరుగుతోందని జడ్పీ ఛైర్మన్‌ నామాన రాంబాబు అన్నారు. విపక్షాలకు ముఖ్యంగా వైకాపాకు విమర్శలు తప్ప అభివృద్ది పట్టదన్నారు.  దీనిపై విమర్శలు వస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగాలని నిర్ణయించడం వల్ల్నే ఇవాళ రైతులకు మేలు జరిగిందని అన్నారు. ఏలేరు ఆయకట్టుకు గోదావరి జలాలు అందించేందుకు ఉద్దేశించిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. దీనిపై వస్తున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం పట్టిసీమ తరవాత అత్యంత ప్రతిష్టాత్మకంగాచేపట్టిన ఈ పథకాన్ని చంద్రబాబునాయుడు ప్రారంబించారు. రూ.1600 కోట్ల వ్యయంతో నిర్మించిన పథకం వల్ల గోదావరి జలాలను వినయోగించుకునే అవకాశం ఏర్పడింది.