పులివెందుల సమీపంలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు

పులివెందుల: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి 30 అడుగుల లోయలో పడింది.