పూర్తయిన పురాతన ఆలయ పునర్నిర్మాణం

సిమ్లా,జూలై27(జ‌నం సాక్షి): హిమాచల్‌ ప్రదేశ్‌ లో 250 ఏళ్ల నాటి ఒక ఆలయాన్ని పునరుద్దరించారు. రాష్ట్ర రాజధాని సిమ్లాకు పదమూడు కిలోవిూటర్ల దూరంలోని కొండలలో ఈ ఆలయం ఉంది.కోచర్‌ రాజవంశీకులహాయంలో ఇది నిర్మితం అయింది. అయితే ఆలయానికి ఉన్న కలప పాడు కావడంతో ఆలయాన్ని కూల్చారు. తదుపరి గత మూడున్నర్న ఏళ్లుగా ఈ ఆలయాన్ని పాత మోడల్‌ లోనే, యదాతధంగా పునర్‌ నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ ,ఆయన భార్య ప్రతిభా సింగ్‌లు దీనికి ప్రత్యేక శ్రద్ద వహించారు. ఆరు కోట్ల రూపాయలు ఇందుకు వ్యయం అయ్యాయి.ఈ ఆలయం ఆర్కిటెక్చర్‌ కాని, ఇతరత్రా ఏవీ చెడకుండా నిర్మించామని చెబుతున్నారు.నిర్మాణంలో బంగారం, వెండి వంటి వాటిని కూడా వినియోగించారు.