పూర్తయిన ప్రతిష్ట, వేద పండితులకు సన్మానం
చండ్రుగొండ జనంసాక్షి (ఆగస్టు 07) : చండ్రుగొండ లో వైభవంగా సాగిన ఐదు రోజుల సాయిబాబా మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. వేద పండితులు వి వి ఆర్ కె మూర్తి ఆధ్వర్యంలో గ్రామస్థుల సహకారంతో దిగ్విజయంగా కార్యక్రమాలు పూర్తయిన నేపథ్యంలో గ్రామస్థులు ప్రతిష్ఠ కమిటీ సభ్యులు కలిసి వి వి ఆర్ కె మూర్తి, వేణు లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ప్రతిష్ఠ కమిటీ సభ్యులు చీదళ్ల పవన్,వేణు దార బాబు, కీసరి కిరణ్ రెడ్డి, రామకృష్ణ, లీలా ప్రసాద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.