పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి- బారి అశోక్ కుమార్

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బారీ అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆ సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్ల నుండి రియంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందన్నారు.ఎంతో మంది విద్యార్థులు రియంబర్స్మెంట్స్ , స్కాలర్షిప్స్ రాక విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చి విద్యారంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, ప్రభుత్వ విద్యారంగాన్ని నీరుగార్చే విధానాలను తీసుకొస్తున్నారని విమర్శించారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ విద్యారంగం మీద లేదని మండిపడ్డారు.తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలన్నారు.కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని,అన్ని ప్రాంతాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలన్నారు.ఈ సమావేశంలో కోల కర్ణాకర్, టిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ , నరేష్ , యశ్వంత్, ప్రదీప్ , నిఖిల్, అరుణ్, గిరి, పవన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు