పెట్రోధరలను ఉపసంహరించుకోవాలి
విజయవాడ,సెప్టెంబర్3(జనం సాక్షి): భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పేరుతో ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచేయడం వల్ల నేడు ప్రజలపై భారాలు పడుతున్నాయని విమర్శించారు. ధరలు నియంత్రిస్తామని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన బిజెపి పెరిగిన ఇందనపు ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. అధికధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం భారీగా ఇందనం ధరలు పెంచి అధిక కష్టాలకు గురి చేసిందని పేర్కొన్నారు. తగ్గించేటప్పుడు పైసల్లోనూ, పెంచేటప్పుడు రూపాయల్లోనూ నిర్ణయాలు తీసుకోవడంలోనే ప్రభుత్వాలకు కార్పొరేట్ కంపెనీలపై ఉన్న ప్రేమ అర్థమవుతోందని తెలిపారు.