పెట్రోమంటపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన
` 31 నుంచి ధరల పెంపుపై పోరుబాట
న్యూఢల్లీి,మార్చి 26(జనంసాక్షి):ఇంధన ధరలతో పాటు నిత్యావసరాల ధరల మంటకు నిరసనగా మెహంగి`ముక్త్‌భారత్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా మూడు దశల పోరాటానికి కాంగ్రెస్ సన్నద్ధమైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకూ ధరల పెరుగుదలకు నిరసనగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలను నిర్వహించనుంది. తొలి దశ పోరులో మార్చి 31ను గ్యాస్ సిలిండర్ షహీది దివస్‌గా పాటించాలని నిర్ణయించింది. మార్చి 31 ఉదయం ధరల పెంపునకు నిరసనగా డప్పులు మోగించి, గంట కొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపుఇచ్చింది.ఈ నెలలో గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ 50 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. ఎల్‌పీజీ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు సిలిండర్లకు దండలు వేసి ఊరేగిస్తారని, ధరల మంటపై ప్రజలను చైతన్యపరుస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా తెలిపారు. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 4 వరకూ పార్టీ సారధ్యంలో జిల్లా, బ్లాక్ స్ధాయిలో ధర్నాలు, ప్రదర్శనలు చేపడతామని చెప్పారు.ఏప్రిల్ 7న రాష్ట్ర రాజధానుల్లో కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌జీవోలు, ప్రజలు, సామాజిక సంస్ధలతో కలిసి ప్రదర్శనలు జరుగుతాయని సుర్జీవాలా వెల్లడిరచారు. పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరల పెంపుతో మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కార్ సామాన్యులపై పెను భారం మోపిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.