పెట్రోల్‌బంక్‌పై భాజపా కార్యకర్తల దాడి

కరీంనగర్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల ఘటనను నిరసిస్తూ నేడు భాజపా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా కరీంనగర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు ఈ ఉదయం నిరిసన ప్రదర్శన చేపట్టారు. నగరంలో తెరిచి ఉంచిన పెట్రోల్‌బంక్‌పై దాడి చేశారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. నల్గోండలో ఆ పార్టీ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.