పెట్రో ధరలు పెరిగితే రాష్టాల్రపై మరింత భారం
ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచనలు
ఉమ్మడిగా ఎదుర్కొనే దిశగా ఆలోచన
న్యూఢల్లీి,మార్చి15( జనం సాక్షి ): రానున్న కాలంలో పెట్రో,గ్యాస్ ధరలపెంపు రాష్టాల్రపై కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా భారం పడనుంది. రవాణారంగ మరింత భారం కావడం, ఆర్టీసీ ఛార్జీలు పెరగడం ఖాయం. ఇది ఓ రకంగా ప్రజల్లో ఆయా ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేక రానుంది. కరోనాను సమర్థంగా నిలువరించడం లోనూ కేంద్రం విఫలమైందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జాతీయ భద్రతను కాపాడడంలో, అంతర్జాతీయ సంబంధాల్లో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబడుతున్నారు. సాగునీటి విధానాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉమ్మడి ఎపి నేతలు మండిపడుతున్నారు. 2,21,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్నా.. 1,80,000 మెగావాట్లను మాత్రమే దేశం వినియోగించు కుంటోందని, సగం దేశం చీకట్లో మగ్గుతోందని గతంలో కెసిఆర్ పదేపదే ఆరోపించారు. మిగులు విద్యుత్‌ను కూడా వినియోగించుకోలేని దౌర్భాగ్యంలో ఉన్నామని అంటున్నారు. ఈ విషయాలను ఉమ్మడిగి పార్లమెంటులో ఎదుర్కోవాలని చూస్తున్నాయి. ఇటీవలి ఫలితాలతో బిజెపి మరింత ధృడంగా మారింది. ఈ క్రమంలో ఉమ్మడిగా కేంద్రాన్ని నిలదీయాలని చూస్తున్నాయి. దేశంలో 70 వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నాయని, కానీ, సాగునీటిని పూర్తిగా వినియోగించుకోవడం లేదని మండిపడ్డారు. జీఎస్టీ పరిహారం ఇచ్చేది లేదని, కావాలంటే రాష్టాల్రు అప్పులు చేసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంపై ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ప్రత్యామ్నాయం కోసం ఇదే సరైన సమయమని దేశంలోని అనేక పార్టీలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో ఇప్పుడు బిజెపిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఎపిలో మాత్రం విద్యుత్ విూటర్ల బిగింపును ప్రభుత్వమే ముందుకు తీసుకుని వెళుతోంది. వ్యవసాయం రాష్టాల్ర స్జబెక్టు అయినా వాటిని సంప్రదించకుండా ఆర్డినెన్స్‌లు తేవడం సమాఖ్య వ్యవస్థకు విఘాతం అని విపక్షాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. బిల్లులపై చర్చ సమయం లోనూ ప్రతిపక్షాల అభ్యంతరాలను కేంద్రం ఖాతరు చేయలేదని మండిపడుతున్నాయి. వ్యవసాయ బిల్లులు రెండూ ప్రధాని మోడీ చెబుతున్నట్లు రైతులకు స్వేచ్ఛను కల్పించవు. రైతులను కార్పొరేట్లకు, పెట్టుబడి దారులకు బానిసలుగా మారుస్తాయి. కాంట్రాక్టు, కంపెనీ సేద్యం దూకుడు పెంచుతాయి. రైతులకు ఇప్పుడు దక్కుతున్న కనీస మద్దతుధర దక్కదు. ఆహార భద్రతకు ముప్పు తెస్తాయి. వ్యవసాయ రంగానికి, రైతులకు, ప్రజలకు నష్టం చేసే బిల్లుల ను కేంద్రం మంకు పట్టుదలతో తేవడానికి వెనుక కార్పొరేట్ల ఆశ్రితపక్షపాతం కనిపిస్తోందని విపక్షాలు ముక్తకంఠంతో నినదిస్తున్నా కేంద్రం మెడలు వంచలేక పోతున్నాయి. తమది రైతు ప్రభుత్వమని చెబుతున్న వైసిపి…కేంద్రంలో బిజెపితో అంటకాగేందుకు, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు వెనుకాడడం లేదన్న విమర్శలు ఉన్నాయి. రైతులను కన్నీరు పెట్టించే రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను రైతులు, ప్రజలందరూ తిప్పి కొట్టాలన్న డిమాండ్ వస్తోంది. మరోవైపు అధ్యక్ష పాలనకు బిజెపి పావులు కదుపుతోందన్న వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే లోక్‌సభ ఎన్నికల్లో కేవలం జాతీయ పార్టీలే పోటీ చేసే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకే ప్రాంతీయ పార్టీలు పరిమితం కావాల్సి ఉంటుంది. జాతీయ పార్టీలుగా పాలన చేసిన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజల అవసరాలు గుర్తించడంలో విఫలమయ్యా యని ఇతర పార్టీలు పదేపదే విమర్శిస్తున్నారు. మొత్తంగా ఇప్పుడున్న బిజెపి ప్రభుత్వంపై అందరికీ వ్యతిరేకత ఉన్నా గంట కట్టేదెవరన్న పద్దతిలో రాజకీయాలు నడుస్తున్నాయి.