*పెద్ద తుప్పరలోని రైతులకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి- శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్*
*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పెద్ద తుప్పరతో పాటు వివిధ గ్రామాల రైతులకు పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని శంషాబాద్ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్ కోరారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో టెలి కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కు బుధవారం శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ మండలంలోని పెద్ద తుప్పర గ్రామంతో పాటు వివిధ గ్రామాలలో రైతులకు పట్టా పాస్ పుస్తకాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం నుంచి రావలసిన రైతు బంధు, రైతు బీమా, క్రాప్ లోన్లు, ఎల్టి లోన్లు ఇలాంటి ఎలాంటి పథకాలు అందడం లేదన్నారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో పిల్లల పెళ్లిళ్లు చేయాలన్న, ఉన్నత విద్య చదివించాలన్న భూమి అమ్మాలంటే కూడా ఎవరు కొనడం లేదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ తిరుపతి రావు,డిఆర్ఓ హరి ప్రియతో పాటు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ను సన్మానిస్తున్న ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్.
Attachments area