పెరికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం
తెలంగాణ జన సమితి అధ్యక్షులు-ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్, జనవరి 7 : పెరికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిదర్శనం అని, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు ఆదివారం రాజధాని నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో పెరికకుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ సొసైటీ 2024 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెప్సీ ఒక సంఘంగా ఏర్పడి తమ హక్కులను సాధించుకునే దిశగా కృషి చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పెరికల కుల సంఘం అండగా నిలిచిందని కుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పెప్సీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ జనుము పండించి దానితో ధాన్యం రవాణ బోరేలు,గోనె పట్టాలు, ధాన్యం పెరిక (సంచుల) తయారీ చేసిన కులవృత్తి అంతరించి పోయినందున జౌళి పరిశ్రమ ఏర్పాటులో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. బలహీన వర్గాలలో అత్యంత వెనుకబడిన పెరిక కులం ఆర్థిక పరిపుష్టి కోసం పెరిక కుల ఫెడరేషన్ ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వాన్ని సవినయంగా కోరారు.తాము తెలంగాణ తొలి దశ మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించామని చెప్పారు. పెప్సీ ప్రధాన కార్యదర్శి తిప్పని సిద్దులు మాట్లాడుతూ తొలిదశ మలిదశ ఉద్యమంలో తాను కీలక భూమిక పోషించి రాష్ట్ర ఏర్పాటుకు తాము కృషి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెప్సీ రాష్ట్ర సలహాదారులు చింతం లక్ష్మీనారాయణ, రాష్ట్ర కోశాధికారి అప్పని సతీష్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆక రాధాకృష్ణ, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బెడుద వెంకటయ్య , మెదక్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బండి శ్రీకాంత్ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ సిహెచ్ రాజు,ఉమ్మడి కోశాధికారి శ్రీరాం వీరయ్య,కార్యదర్శి లక్కర్స్ నరహరి, లోకం నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు