పెరిగిన డీజిల్ ధరలు

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ): దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) ఆదివారం పెట్రోల్ ధరలను పెంచలేదు. కానీ, డీజిల్ ధరల్లో మాత్రం మార్పులు చేశాయి. వరుసగా మూడో రోజు డీజిల్ ధరలు పెరిగాయి. ఈ రోజు డీజిల్ ధర లీటర్‌కు 6 పైసలు చొప్పున పెరిగింది. రోజువారీ ధరల్లో భాగంగా దేశరాజధాని ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.68.77 ఉండగా, ముంబైలో లీటర్ ధర రూ.73.01, కోల్‌కతాలో లీటర్ డీజిల్ ధర రూ.71.61, చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ.72.64గా ఉంది. పెరిగిన డీజిల్ ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.అదేవిధంగా పెట్రోల్ ధర యథాతధంగా ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.23 కాగా, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర లీటర్ రూ.84.67, కోల్‌కతాలో లీటర్ ధర రూ.80.18, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.80.23గా నమోదైంది. వ్యాట్ కారణంగా అన్ని ప్రధాన నగరాలు సహా రాష్ట్ర రాజధానుల్లో కంటే ఢిల్లీలోనే పెట్రోల్‌ 27 శాతం, డీజిల్ 17.24 శాతం మేర ధరలు చౌకగా ఉన్నాయి.