పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం రూ.240పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. నెల రోజుల్లో ఇదే గరిష్ఠ ధర కావడం గమనార్హం. అలాగే వెండి రూ.900 పెరిగి 38,500కు చేరింది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు జరగడంతో డిమాండు పెరిగిందని దీంతో బంగారం, వెండి ధరలు దూసుకెళ్లాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.