పెరిగిన వివోఎల జీతాలు


హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు
కడప,నవంబర్‌27(జ‌నంసాక్షి): సిఐటియు పోరాట ఫలితంగా వెలుగు విఒఎ లకు ప్రభుత్వం మూడు వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు జిఒ ఇచ్చిందని వెలుగు విఒఎ లు పేర్కొన్నారు. వేతనాల జిఒ విడుదలైనందుకు వెలుగు విఒఎ లంతా మంగళవారం సంతోషంగా కేక్‌ కట్‌ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎం.సుబ్బరాయుడు మాట్లాడుతూ.. గ్రామ సమాఖ్యల సహాయకులు యానిమేటర్లకు నెలకు మూడు వేల రూపాయల వేతనం దక్కేలా ముఖ్యమంత్రి చంద్రబాబు జిఒ ఇవ్వడం సంతోషకరమన్నారు. సిఐటియు పోరాట ఫలితంగా వెలుగు విఒఎ లకు ప్రభుత్వం మూడు వేల రూపాయల వేతనం ఇచ్చేందుకు జిఒ ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ఆదాయ వనరుల లభ్యతను బట్టి మరో రెండు వేల వరకు జీతం తీసుకునేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారన్నారు. గ్రామ సమాఖ్యలలో సభ్యులు నిబద్ధతతో సమర్థవంతంగా పని చేస్తూ సమాఖ్యల అభ్యున్నతికి కఅషి చేయాలని కోరారు. గ్రామ సర్వతోముఖాభివఅద్ధిలో యానిమేటర్ల పాత్ర ప్రశంసనీయమని కొనియాడారు. సిఐటియు నాయకులు నారాయణరెడ్డి మాట్లాడుతూ..12 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం తమను గుర్తించలేదని, నేడు తమ పోరాట ఫలితంగా వెలుగు విఒఎ లకు వేతనం ఇచ్చేందుకు ప్రభుత్వం జిఒ విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓబులేసు ప్రసాద్‌ నారాయణరెడ్డి, భాగ్యమ్మ, తదితరులు పాల్గన్నారు.