పెళ్లి కోసం దాచిన నగలు, నగదు దగ్ధం

ఆదిలాబాద్‌ : పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్‌ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ ఇంట్లో దాచిన పెళ్లి కోసం నగలు, నగదు అగ్నికి ఆహూతయ్యాయి. కట్టుబట్టలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి ఆలస్యంగా రావడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని స్థానికులు చెప్పారు.