పేదరికాన్ని జయించిన యువకుడు

యువకుని మేధస్సుకి అభినందనలు వెల్లువ

టేకులపల్లి, జూలై  ( జనం సాక్షి) : నిరుపేద కుటుంబంలో జన్మించి బాసరలో ట్రిపుల్ ఐటీ అభ్యసిస్తూ క్యాంపస్ సెలక్షన్లో అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించి తన కుటుంబ పేదరికాన్ని జయించిన ఓ యువకుని మేధస్సుకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన నిరుపేదలైన తంగేళ్లపల్లి ఈశ్వర చారి, అనిత లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడైన తంగేళ్లపల్లి నిఖిల్ స్థానిక ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో విద్యనిభ్యసించి 2015-16 సంవత్సరంలో బాసర ఇంజనీరింగ్ కాలేజీలో ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించుకున్నాడు. ఇంటర్ తో పాటు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ను బాసర ఆర్ జి యు కె టి లో నిఖిల్ పూర్తి చేశారు. చివరి ఏడాది చదువుతున్న క్రమంలో క్యాంపస్ సెలక్షన్స్ లో అమెజాన్ సంస్థలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరుగా ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యారు. ఆ అమెజాన్ కంపెనీలో వార్షిక వేతనం రూ.64 లక్షలు ఇవ్వనున్నారు. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిట్లో నీ అమెజాన్ కంపెనీలో మరో రెండు నెలల్లో విధుల్లో చేరబోతున్నట్లు ఆ యువకుడు నిఖిల్ తెలిపారు. ఒక సామాన్య నిరుపేద కుటుంబంలో జన్మించిన నిఖిల్ ఆయన తల్లిదండ్రులను పలువురు అభినందించారు.