పేదలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం..
అర్హులందరికీ ఆసరా పెన్షన్లు
– జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ సెప్టెంబర్ 9 (జనం సాక్షి):
దేశంలో ఎక్కడా లేనివిధంగా బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు, ఒంటరి మహిళలు, వృద్ధులకు, దివ్యాంగులకు, అండగా ఉంటూ దీర్ఘకాలిక రోగులకు మానవతా దృక్పథంతో పెన్షన్ అందజేస్తున్న ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు అన్నారు. శుక్రవారం కోహిర్ మండలంలోని కోహిర్,పైడిగుమ్మల్, సజ్జపూర్, మనియర్ పల్లి, గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వం నుండి నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మేనని వ్యాఖ్యానించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీడీ పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్స్ మొదలగు సంక్షేమ పథకాలను అందిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.
కావున పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రభుత్వానికి అండగా నిలవాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.కార్యక్రమాల్లో ఆత్మ చైర్మన్ పెంటారెడ్డి, ఎఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మెంబర్ బంటు రామకృష్ణ, సర్పంచ్ లు అతియ జవిద్, శకుంతల, మ్యాతరి నర్సింహులు, వెంకట్‌రామ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కె నర్సింహులు, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు రవి కిరణ్, నాయకులు గోవర్ధన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, కలిమ్, ఇఫ్తేకర్, సంపత్, హన్నన్ జవిద్, సావుద్, మొల్లయ్య, సాలోమన్, సురేష్, సుదర్శన్‌రెడ్డి, వినోద్, విఠల్ రెడ్డీ, ఆయా గ్రామాల సర్పచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు