పేదలకు అంత్యోదయ కార్డులు జారీ
కరీంనగర్, నవంబర్ 23 : బోయిన్‌పల్లి మండలంలోని 999 మందికి అంత్యోదయ కార్డులను శుక్రవారం అధికారులు జారీ చేశారని మండల అధికారి రాజమోహన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మండలంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలను గుర్తించి వారికి అంత్యోదయ కార్డులు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఆచరణలోకి తీసుకువచ్చిందని, దీని వల్ల పేదలు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, వికలాంగుల పెన్సన్లను అందజేసిందని ఆయన తెలిపారు.