పేదలకు వరంగా మారిన ముఖ్యమంత్రి సహాయక నిధి
– మంగపేట మండలంలో జోరుగా సిఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ.
– ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా పేద ప్రజల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతున్నాయి.
– టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మంగపేట మండల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మినారాయణ.
మంగపేట,ఆగస్టు 30
(జనంసాక్షి):-
ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్,నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ చొరవతో మంజూరైన (సిఎంఆర్ఎఫ్) ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగపేట మండలం మల్లూరు గ్రామానికి చెందిన, మారబోయిన గోవర్ధన్ కు
45,000/- రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును, కొత్తపేట(చేరుపల్లి) గ్రామానికి చెందిన యంపల్లి వెంకట నర్సయ్య కు 30,000/- రూపాయిల చెక్కును,పురెడిపల్లి గ్రామానికి చెందిన రోహిత్ కు 60,000 రూపాయల చెక్కును సీనియర్ నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ లబ్ధిదారులకు అందజేశారు.పంపిణి అనంతరం వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయనిది తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వర ప్రాధాన్యతగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుంది, ప్రైవేటు హాస్పిటల్లో వైద్యం పొంది ఆర్థికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పేదల అభ్యున్నతినికి ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజుయాదవ్, మల్లూరు దేవస్థానం చైర్మన్ నుతిలకంటి ముకుందం,పిఏసిఎస్ డైరెక్టర్ డేగల ఆదినారాయణ, మల్లూరు గ్రామ కమిటి అధ్యక్షులు సోయం ఈశ్వర్,కొత్తపేట గ్రామ కమిటి అధ్యక్షులు చిట్టిమల్ల బాలకృష్ణ, పురేడిపల్లి గ్రామ కమిటి అధ్యక్షులు, కొప్పుల మాణిక్యం,టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ కార్యదర్శి యలమదాసరి నరేష్,యాలం కాంతారావు,గ్రామ కమిటి యూత్ అధ్యక్షుడు గుండారపు నాగేంద్రబాబు,గ్రామ కమిటీ మహిళ కార్యదర్శి జజ్జరి శ్రీలత,టీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు తాటి నారాయణ, ఎస్టి సెల్ మాజీ ఉపాధ్యక్షుడు తోలం విశ్వనాథం,కుకట్ల శ్రీను,దేవేందర్,చందర్ రావు,
సోషల్ మీడియా ఇన్చార్జి గుడివాడ శ్రీహరి,తదితరుల పాల్గొన్నారు.